పీఎంశ్రీ పాఠశాలలకు ఇంజినీరింగ్ కళాశాలల అనుసంధానం: విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ

రిపోర్టర్: భాస్కర్ స్థలం: నెల్లూరు

పాఠశాల దశలోనే విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సమగ్రశిక్షా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ డి.వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆరు పీఎంశ్రీ పాఠశాలలను ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలతో అనుసంధానం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతికత, పరిశోధన అంశాలపై ఈ నెల నుంచి నవంబరు వరకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన సూచించారు.