కెనడాలో వృద్ధురాలిని మోసగించి భారీ బంగారు ఆభరణాలు అపహరణ

రిపోర్టర్: కిరణ్ స్థలం: Brampton

కెనడా దేశంలోని బ్రాంప్టన్ నగరంలో సాయంత్రం వేళ వాకింగ్ వెళ్లిన డెబ్బై ఎనిమిదేళ్ల వృద్ధురాలిని ఓ దుండగురాలు నమ్మించి మోసం చేసింది. ఆమె మెడలోని సుమారు ఇరవై వేల డాలర్ల విలువైన బంగారు ఆభరణాలను అపహరించుకుపోయినట్లు బాధితురాలి కుమారుడు రాఘవేంద్ర కుమార్ వెల్లడించారు. కాలికి నమస్కరించి, ఆలింగ్నం చేసుకునే నటించి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.