కోర్టు కేసులు భూ వివాదాలతో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణంలో తీవ్ర జాప్యం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: దగదర్తి
జిల్లాలో ఏర్పాటు కానున్న గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. దామవరం, కౌరుగుంట గ్రామాల పరిధిలో 1379.71 ఎకరాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 669.12 ఎకరాలు సేకరించినట్లు పేర్కొన్నారు. భూముల విషయంలో రైతులు, పారిశ్రామికవేత్తల మధ్య వివాదం కోవూరు సివిల్ కోర్టు పరిధిలో ఉందని తహసీల్దార్ లాజరస్ వెల్లడించారు. ఇరువర్గాలు రాజీ కుదుర్చుకుంటే పరిహారం అందిస్తామని, త్వరలోనే భూసేకరణ పూర్తి చేసి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.