గురువులే మూలస్తంభాలు: వర్ధన్నపేటలో రిటైర్డ్ టీచర్లకు సన్మానం
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వర్ధన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భావి భారత పౌరుల నిర్మాణానికి గురువులే మూలస్తంభాలని కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ ఈగ దామోదర్ అన్నారు. పలువురు రిటైర్డ్ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సన్మానించారు.
అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతులు వెలిగించే గురువులను గౌరవించడం అందరి బాధ్యత అని దామోదర్ పేర్కొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.