ఉక్రెయిన్ ఒడేసా ఓడరేవు సమీపంలో నౌకలపై రష్యా డ్రోన్ల దాడులు
రిపోర్టర్: సతీష్
స్థలం: వరల్డ్
ఉక్రెయిన్‌లోని ఒడేసా ఓడరేవు సమీపంలో డ్రై కార్గో నౌక మరియు ట్యాంకర్‌ను రష్యాకు చెందిన గెరాన్-4 సీకర్ డ్రోన్లు విజయవంతంగా ధ్వంసం చేశాయి. ఉక్రెయిన్ బలగాలకు సైనిక సరఫరాలను అందిస్తున్నాయనే ఆరోపణలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు మాస్కో స్పష్టం చేసింది. నల్ల సముద్రం గుండా ఉక్రెయిన్ సైనిక సరఫరా మార్గాలను అడ్డుకోవడంలో భాగంగానే ఈ దాడులకు పాల్పడినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.