బ్రిక్స్ సదస్సులో మోదీ దౌత్య వ్యూహం, ఇరాన్ అధ్యక్షుడితో నడక
రిపోర్టర్: శివ
స్థలం: న్యూఢిల్లీ
న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో జరుగుతున్న బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తన దౌత్యపరమైన వ్యూహాన్ని చాటారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ చేయి పట్టుకుని ఆయన హాలులోకి నడిపించారు. ఈ వేడుకలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కూడా పక్కనే నడుస్తూ వేదికపైకి చేరుకున్నారు. ప్రపంచ దేశాల మధ్య ఈ అరుదైన దృశ్యం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.