అమెరికాలో దీపావళి సంబురాలు: రెండు కోట్ల ప్రత్యేక స్టాంపులను ముద్రించిన యూఎస్పీఎస్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Washington
భారతీయులకు అత్యంత పవిత్రమైన దీపావళి పండగను పురస్కరించుకొని దాదాపు రెండు కోట్ల ప్రత్యేక దివాలీ ఫరెవర్ స్టాంపులను ముద్రించినట్లు యూఎస్ పోస్టల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్ సాహిబానీ గంభీర్ తెలిపారు. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో రంగవల్లి డిజైన్‌తో కూడిన ఈ స్టాంప్‌ను ఆవిష్కరించారు. భారతీయ సమాజం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు. అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా తదితరులు పాల్గొన్నారు.