హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో కోట్ల ప్రజాధనంతో నిర్మించిన కే హబ్ వృథా
రిపోర్టర్: గోపి
స్థలం: హనుమకొండ
కాకతీయ యూనివర్సిటీలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన కే హబ్ భవనం పూర్తిగా వృథాగా మారిందని విద్యార్థులు మండిపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రుసా నిధులతో సుమారు పదిహేను కోట్ల వ్యయంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, మూడేళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభం కాలేదని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. భవనంలో అదనపు మార్పుల పేరుతో మరో రెండు కోట్లు ఖర్చు చేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.