విద్యార్థుల శాంతియుత నిరసన హక్కుల పరిరక్షణకు న్యాయవ్యవస్థ కట్టుబడి ఉందన్న సీజేఐ

రిపోర్టర్: హరి స్థలం: పాట్నా

విద్యార్థుల శాంతియుత నిరసన తెలిపే ప్రాథమిక హక్కును పరిరక్షించడానికి న్యాయవ్యవస్థ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని భారత ప్రధాన జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. పాట్నాలోని చాణక్య నేషనల్ లా యూనివర్సిటీలో విద్యార్థులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అణచివేత వంటి ఘటనలు ఎదురైనప్పుడు కోర్టులు చూస్తూ ఊరుకోవని ఆయన తేల్చిచెప్పారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.