సింగరేణి కార్మికులకు దీపావళి కానుక: ఒక్కోరికి లక్షా పదివేల బోనస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
సింగరేణి కార్మికులకు దీపావళి సందర్భంగా భారీ బొనాంజా లభించనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. నవంబర్ ఐదో తేదీన అర్హులైన ముప్ఫై ఎనిమిది వేల మంది కార్మికుల బ్యాంకు ఖాతాల్లో సుమారు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల బోనస్ నగదు జమ చేయనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా లక్షా పదివేల రెండు వందల యాభై రూపాయలు అందనుండగా, దసరా బోనస్‌తో కలిపి నెలాఖరులోగా రెండు లక్షల అరవై ఐదు వేల దాకా ప్రయోజనం చేకూరనుంది.