అవినీతి ఆరోపణలు నిరాధారమన్న ఉత్తరాఖండ్ మంత్రి రేఖా ఆర్య
రిపోర్టర్: సతీష్
స్థలం: డెహ్రాడూన్
తనపై భర్త గిర్ధారి లాల్ సాహు చేసిన అవినీతి ఆరోపణలు నూటికి నూరుపాటూ నిరాధారమని ఉత్తరాఖండ్ మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి రేఖా ఆర్య స్పష్టం చేశారు. తన జీవితం బహిరంగ పుస్తకం లాంటిదని, ఏ విచారణకైనా తాను సిద్ధమని ఆమె తెలిపారు. తనపై గృహహింస ఆరోపణలతో అక్టోబర్ 15న పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మంత్రి వివరించారు.