'దేశాన్ని మరింత ముందుకు నడిపించాలి': వారణాసిలో చంద్రబాబు, నేతల ప్రత్యేక పూజలు

రిపోర్టర్: సతీష్ స్థలం: వారణాసి

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవిత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథుని ఆలయంలో 'సేవా సంకల్ప్ అభియాన్' ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో పాటు పలువురు ఎన్డీయే నేతలు ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. మోదీ ఆయురారోగ్యాలతో దేశాన్ని మరింత ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు.