ఇరాన్ అణు ఆయుధాల ముప్పుపై డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: సతీష్
స్థలం: Washington
ఇరాన్ తో యుద్ధ ఖర్చులపై వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టిగా తిప్పికొట్టారు. ఇరాన్ అణు ఆయుధాలు సాధిస్తే జరిగే నష్టం దీనికంటే వేల రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ కు అణు ఆయుధాన్ని ఇస్తే అసలు ఖర్చు ఏంటో మీకు తెలుస్తుందని ట్రంప్ హెచ్చరించారు. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్ లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.