ఓటర్ల జాబితా సవరణపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం: సుధాన్షు త్రివేది

రిపోర్టర్: కృష్ణ స్థలం: న్యూఢిల్లీ

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాధారమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాజ్యాంగ సంస్థలను అస్థిపరం చేసేందుకే ప్రతిపక్షాలు నిత్యం కుట్రలు పన్నుతున్నాయని మండిపడ్డారు. బూత్ స్థాయి ఏజెంట్లు సంతకాలు చేసిన తర్వాత ఇప్పుడు అభ్యంతరాలు చెప్పడం సరికాదని స్పష్టం చేస్తూ, దేశ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షాల తీరు పెను ముప్పుగా మారిందని విమర్శించారు.