స్వపక్ష అభ్యర్థిపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి: కేసు నమోదు
రిపోర్టర్: వెంకట్
స్థలం: తూర్పుగోదావరి
తమ పార్టీ తరఫున ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వ్యక్తిపై వైకాపా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడికి దిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఏకగ్రీవానికి అంగీకరించారన్న ఆగ్రహంతో తన అనుచరులతో కలిసి గ్రామానికి వెళ్లిన రాజా, అభ్యర్థి మణికంఠపై చేయిచేసుకున్నారని వీఆర్వో ఫిర్యాదుతో పది మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.