రైల్వే ప్రయాణికులకు షాక్: రాత్రిపూట మొబైల్ ఛార్జింగ్ పై నిషేధం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
రాత్రి వేళల్లో రైళ్లలో ప్రయాణించే వారికి భారతీయ రైల్వే శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు కోచ్లలో మొబైల్, ల్యాప్టాప్ ఛార్జింగ్ పాయింట్లు మూసివేయాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. ప్రయాణికుల రక్షణ మరియు రైలు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.