నెల్లూరులో విద్యార్థులకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా 'డైస్‌' శిక్షణ

రిపోర్టర్: విజయ్ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలల విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 'డైస్‌' కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లా నుంచి ఎంపికైన ఆరు పాఠశాలల విద్యార్థులకు ఉన్నత విద్యా సంస్థల సహకారంతో సాంకేతిక, సైన్స్, పరిశోధన అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. స్టార్టప్‌లు, మేధో సంపత్తి హక్కులపై అవగాహన కల్పిస్తూ సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ నెల 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.