ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వాడకంపై కేంద్రం ఆంక్షలు
రిపోర్టర్: హరి
స్థలం: India
ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లో ఉంటూ రీల్స్ చేయడం, వ్యక్తిగత ప్రచారం చేసుకోవడంపై కేంద్రం కఠినంగా వ్యవహరించనుంది. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఉద్యోగుల కోసం ప్రత్యేక 'కోడ్ ఆఫ్ కండక్ట్'ను సిద్ధం చేస్తోంది. విధి నిర్వహణలో సోషల్ మీడియా వాడకాన్ని నియంత్రిస్తూ, నిబంధనలు ఉల్లంఘించే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అధికారిక సమయం దుర్వినియోగం కాకుండా చూడటమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.