అన్నదాతల ఆక్రోశం: పూణే జిల్లాలో వర్షాభావంతో తీవ్రంగా దెబ్బతిన్న పంటలు
రిపోర్టర్: అశోక్
స్థలం: పూణే
పూణే జిల్లాలో వర్షాభావం కారణంగా దాదాపు అరవై ఐదు శాతం ఖరీఫ్ పంటలు దెబ్బతిన్నాయని జిల్లా వ్యవసాయాధికారి వైభవ్ తాంబే తెలిపారు. రెండు లక్షల హెక్టార్లలో లక్షా ముప్ పై వేల హెక్టార్ల విస్తీర్ణం నాశనమైందని, చెరుకు, ఉల్లి, పండ్ల తోటలతో కలిపి మొత్తం మూడు లక్షల పద్దెనిమిది వేల హెక్టార్లలో నష్టం వాటిల్లిందని ఆయన వివరించారు. ఈ అపూర్వ నష్టం రైతులకు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.