స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై అనంతపురంలో వైకాపాపై ఎమ్మెల్యే ప్రసాద్ నిప్పులు

రిపోర్టర్: సతీష్ స్థలం: అనంతపురం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా మోసం చేస్తున్న వైకాపాకు ప్రజలు త్వరలో గట్టిగా బుద్ధి చెబుతారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లను ముప్పై నాలుగు శాతానికి ఖరారు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి మద్దతుగా నగరంలో నిర్వహించిన భారీ ర్యాలీలో వారు మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.