టెక్సాస్ ఆలయంలో వైభవంగా దీపావళి వేడుకలు: ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహణ
రిపోర్టర్: రాజేష్
స్థలం: టెక్సాస్
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న శ్రీ మీనాక్షి టెంపుల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్ ముప్ పై ఒకటో తేదీన గ్రాండ్ దీపావళి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్ లో భాగంగా ఉచిత ఆరోగ్య శిబిరం, ప్రత్యేక లక్ష్మీ పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, రథోత్సవం నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సకుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.