ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం

రిపోర్టర్: Darla Venkateswarlu స్థలం: సూళ్లూరుపేట

తడ మండలం మాంబట్టులో పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. సూళ్ళూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ పాల్గొని ప్రజల నుండి అర్జీలు సేకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి మొత్తం 55 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ 31, గృహనిర్మాణ 10, విద్యుత్ 5, పంచాయతీ రాజ్ 4, ఇతర శాఖల నుండి 5 అర్జీలు అందాయి. ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి గడువులోగా పరిష్కరించాలని, అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.