నెల్లూరు జిల్లాలో రోడ్డు భద్రత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
రిపోర్టర్: మహేష్
స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు SP Nellore వెల్లడించారు. నిద్రమత్తు, అలసటతో డ్రైవింగ్ చేసే వాహనదారులకు ముఖం కడుక్కోవడం, నీరు తాగడంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే పల్లె నిద్ర కార్యక్రమాలతో పాటు నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ఈగల్ టీం ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.