రామడుగులో ఉత్సాహంగా కొనసాగుతున్న ఉట్టి కొట్టే వేడుకలు

రిపోర్టర్: ASIF reporter స్థలం: నిజామాబాద్ రూరల్

నిజామాబాద్ రూరల్ మండలం రామడుగు గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన ఉట్టి కొట్టే కార్యక్రమం గ్రామస్థులను, ముఖ్యంగా యువకులను ఎంతగానో ఆకట్టుకుంది.

స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొని ఉట్టి కొట్టేందుకు పోటీపడ్డారు. ఈ వేడుకల వల్ల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో పాటు ప్రజలందరూ సంతోషంగా భాగస్వాములు అవుతున్నారని నిర్వాహకులు తెలిపారు.