విశాఖ సీపీ చొరవతో తిరిగి దక్కిన పోగొట్టుకున్న మొబైల్ ఫోన్

రిపోర్టర్: సునీల్ స్థలం: Visakhapatnam

మంచిర్యాలకు చెందిన సంపత్ ప్రయాణంలో తన మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నారు. స్థానిక పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో, విశాఖ సీపీని ఆశ్రయించారు. స్పందించిన సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి, ప్రత్యేక చొరవ తీసుకుని ఫోన్‌ను రికవరీ చేయించి బాధితుడికి అందజేశారు. పోలీసుల సత్వర స్పందనపై సంపత్ హర్షం వ్యక్తం చేస్తూ, సీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.