వడోదర రైల్వే స్టేషన్ సమీపంలో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆమోదం

రిపోర్టర్: సతీష్ స్థలం: Vadodara

ప్రయాణికుల సౌకర్యార్థం మరియు రవాణా మెరుగుపరచడమే లక్ష్యంగా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వడోదర రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అల్కాపురి వద్ద నూతన రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రాంతాల్లో రద్దీ తగ్గి రాకపోకలు మరింత సులభమవుతాయని, ప్రయాణ సమయం గణనీయంగా ఆదా అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.