ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ నివారణకు ఏఐ టెక్నాలజీతో ఎన్టీఆర్ పోలీసుల పర్యవేక్షణ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: ఎన్టీఆర్
దసరా ఉత్సవాల్లో ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి తరలివచ్చే భక్తుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు ఎన్టీఆర్ పోలీస్ విభాగం వెల్లడించింది. ఏఐ డిజిటల్ ట్విన్, స్మార్ట్ మానిటరింగ్ మరియు డిజిటల్ మ్యాప్స్ వంటి నూతన పద్ధతుల ద్వారా భక్తుల రాకపోకలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు అధికారికంగా పేర్కొన్నారు.