ప్రజా సమస్యలపై గిద్దలూరులో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటన
రిపోర్టర్: రమేష్
స్థలం: ప్రకాశం
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి వివిధ వీధుల్లో పర్యటించి ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఎస్టీ కాలనీలో రహదారి నిర్మాణంపై అధికారులను నిలదీశారు. తాగునీటి సమస్యపై స్పందిస్తూ మూడు రోజులకు ఒకసారి నీరు అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులను ఆదేశించారు. స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.