మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 15 మంది మృతి

రిపోర్టర్: సునీల్ స్థలం: మహారాష్ట్ర

మహారాష్ట్రలోని భండారా, నాందేడ్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భండారాలో ట్రక్కును పికప్ వాహనం ఢీకొనడంతో ముగ్గురు పిల్లలు సహా 9 మంది మృతి చెందారు. నాందేడ్ జిల్లాలో ప్యాసింజర్ వ్యాన్, ట్రక్కు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదాల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.