డ్రగ్స్, గంజాయికి దూరంగా ఉంటూ బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి.. చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ పిలుపు!

రిపోర్టర్: Chinukani Yuvaraju స్థలం: చౌటుప్పల్

చౌటుప్పల్ పట్టణంలోని అరవింద జూనియర్ కళాశాలలో డీవైఎఫ్ఐ మూడో జిల్లా మహాసభల సందర్భంగా నిర్వహించిన సెమినార్లో చౌటుప్పల్ సీఐ మన్మధ కుమార్ విద్యార్థులు మరియు యువతనుద్దేశించి మాట్లాడారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు, ముఖ్యంగా డ్రగ్స్ మరియు గంజాయికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయికి సంబంధించిన సమాచారం ఏమైనా ఉంటే వెంటనే పోలీసులకు అందించాలని, అదేవిధంగా మొబైల్ ఫోన్లకు బానిసలు కావద్దని హితవు పలికారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధుకృష్ణ మాట్లాడుతూ స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, కాలుష్య నివారణే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బత్తుల శంకర్, దుర్గయ్య, ఎండీ ఖయ్యూం, పల్లె శివకుమార్, తీగుళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.