అమనగల్లులో అమరవీరుల సంస్మరణార్థం భారీ రక్తదాన శిబిరానికి పోలీసుల పిలుపు

రిపోర్టర్: Mohammad Abdul Azeem స్థలం: ఆమనగల్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమనగల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో నేడు భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. లయన్స్ క్లబ్ మరియు పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ శిబిరం జరగనుంది. ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడేందుకు యువకులు, స్వచ్ఛంద రక్తదాతలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేయాలని సీఐ ఎస్. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.