బెల్లంపల్లిలో ఘనంగా గణేష్ విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: ramesh chitty
స్థలం: బెల్లంపల్లి
బెల్లంపల్లి పట్టణంలో పోచమ్మ చెరువు వద్ద జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, ఏసీపీ కిరణ్ కుమార్ పరిశీలించారు. పట్టణంలో 260 విగ్రహాలు ప్రతిష్టించగా, నిమజ్జనం కోసం క్రేన్లు, గజ ఈతగాళ్లు, సింగరేణి సిబ్బందిని అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. భక్తులు శాంతిభద్రతలకు ఆటంకం కలగకుండా ప్రశాంతంగా నిమజ్జనం జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.