ఒరిస్సా హైకోర్టులో నర్లా ఎమ్మెల్యే మనోరమ మొహంతి ఎన్నికపై సంచలన సవాల్
రిపోర్టర్: మహేష్
స్థలం: Cuttack
ఒడిశాలోని నర్లా నియోజకవర్గ బిజేడి ఎమ్మెల్యే మనోరమ మొహంతి ఎన్నికను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఒరిస్సా హైకోర్టు విచారణ చేపట్టిందని న్యాయవాదులు తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి భక్త చరణ్ దాస్ ఉపసంహరించుకున్న పిటిషన్ లో తనను ప్రత్యామ్నాయ పిటిషనర్‌గా చేర్చాలని బీజేపీ అభ్యర్థి అనిరుద్ధ ప్రధాన్ కోరారని, ఈ వ్యవహారంపై తదుపరి విచారణ నవంబర్ పదకొండవ తేదీకి వాయిదా పడిందని కోర్టు వర్గాలు వెల్లడించాయి.