జంతర్ మంతర్ అక్రమ ప్రవేశం కేసు: సీజేపీ నేతలకు పోలీసుల నోటీసులు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: దిల్లీ
జంతర్ మంతర్ అక్రమ ప్రవేశం కేసులో కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాకు దిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారని అధికారులు తెలిపారు. నిషిద్ధ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించిన ఆరోపణలపై వీరిని గురువారం విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. తీహార్ జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే దిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఈ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.