చంద్రబాబు ముందుచూపు వల్లే ఏపీలో కరవు లేదు: కేటీఆర్ ప్రశంసలు
రిపోర్టర్: హరి
స్థలం: హైదరాబాద్
తెలంగాణ కంటే తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముందుచూపు కారణంగానే అక్కడ కరవు రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో నీటిని సకాలంలో ఎత్తిపోసుకోవడం వల్ల క్రాప్ హాలిడే సమస్య రాలేదన్నారు. కానీ తెలంగాణలో లోటు వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే రాష్ట్రంలో కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.