స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక కసరత్తు
రిపోర్టర్: రాము
స్థలం: కాకినాడ
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించి కీలక దిశానిర్దేశం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్‌ను స్థానిక ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని, పోటీ చేసే స్థణాల సంఖ్య కంటే గెలుపు అవకాశాలున్న చోటే దృష్టి పెట్టాలని ఆయన కేడర్‌ను అప్రమత్తం చేశారు. కూటమిలోని టీడీపీ, బీజేపీలతో సీట్ల సర్దుబాటుపై కసరత్తు జరుగుతున్న వేళ పవన్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.