రాయగిరిలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

రిపోర్టర్: Madhu Bngr స్థలం: భువనగిరి

భువనగిరి పట్టణంలోని రాయగిరిలో యాదవ సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో టీపీసీసీ సభ్యులు తంగళ్లపల్లి రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడికి ప్రత్యేక పూజలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇలాంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజలందరిలో ఐక్యతను, సత్సంబంధాలను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యాదవ సంఘం పెద్దలు, యువకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.