ఆత్మకూరులో రూ.53 కోట్లతో అభివృద్ధి పనుల ప్రారంభం

రిపోర్టర్: కృష్ణ స్థలం: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఒకే రోజు రూ.53.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రూ.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో స్థానిక ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రజలకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.