ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్పై అవినీతి నిరోధక శాఖ విచారణ

రిపోర్టర్: సతీష్ స్థలం: జైపూర్

అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రభుత్వానికి నష్టం చేకూర్చారనే ఆరోపణలపై సీనియర్ ఐఏఎస్ అధికారి శిఖర్ అగర్వాల్పై ఏసీబీ విచారణకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించి, కుటుంబ సభ్యుల పేరిట తక్కువ ధరకే విల్లాలను కొనుగోలు చేశారని ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఈ అక్రమాలపై లోతైన దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అధికారికంగా ఆమోదం తెలిపింది.