యువ నటీమణులపై అనవసర ప్రశ్నలు అడగడం సరికాదు అంటున్న సందీప్ కిషన్
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
యువ నటీమణులపై ఇంటర్వ్యూలలో బాక్సాఫీస్ సక్సెస్ రేషియో, ఇతర నటులతో పోలికలంటూ అనవసరమైన ప్రశ్నలు అడగడం సరికాదని ప్రముఖ నటుడు సందీప్ కిషన్ పేర్కొన్నారు. హైదరాబాద్లో జరిగిన తన రాబోయే చిత్రం సిగ్మా ప్రమోషన్ల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేవలం 25 ఏళ్ల వయసులోనే ఫరియా అబ్దుల్లా ఎన్నో విజయాలు సాధించిందని, ఆమెను అలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని మద్దతు తెలిపారు. నటీనటుల వ్యక్తిగత ప్రయాణాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు.