సైకిల్ పై తిరుగుతూ... సమస్యలను గుర్తిస్తూ..
రిపోర్టర్: chandrareddy damidi
స్థలం: హుస్నాబాద్
హుస్నాబాద్ మున్సిపల్ పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ పలు వార్డుల్లో సైకిల్ పై తిరుగుతూ... స్థానిక రోడ్లు మరియు మురికి కాలువల పరిశుభ్రత పై సమస్యలను గుర్తిస్తూ... శానిటేషన్ కార్మికులకు దిశానిర్దేశం చేశారు. కమిషనర్ ఆకస్మిక తనిఖీ చేయడంపై మున్సిపల్ అధికారులు, కార్మికులు విస్మయానికి గురయ్యారు. సైకిల్ పై పట్టణంలో పయనించడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు.