హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని ఇద్దరు మృతి
రిపోర్టర్: విజయ్
స్థలం: Nakrekal
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారని క్షతగాత్రుడు జొన్నలగడ్డ ప్రశాంత్ తెలిపారు. అటిపాముల గ్రామ శివారులో బైకును లారీ వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. ఈ దుర్ఘటనలో గోగుల స్వాతి, జొన్నలగడ్డ వాసు ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.