దెందుకూరులో రైల్వే మూడో లైన్ సమస్యను పరిశీలించిన ఖమ్మం కలెక్టర్

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: ఖమ్మం

ఖమ్మం జిల్లా మధిర మండలం దెందుకూరు గ్రామంలో రైల్వే మూడో లైన్ నిర్మాణం కారణంగా పొలాలకు వెళ్లేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారంటూ అందిన ఫిర్యాదుపై జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. రైల్వే అధికారులతో కలిసి మ్యాప్లను పరిశీలించిన ఆయన, రైతులకు రాకపోకల ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని రైల్వే అధికారులకు స్పష్టం చేస్తూ జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ భరోసానిచ్చారు.