ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని తిరుమలలో ప్రార్థించానన్న మల్లు భట్టి విక్రమార్క
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: తిరుమల
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడి. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం, తాగు, సాగునీటి కొరత, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ప్రజలను కాపాడాలని శ్రీవారిని వేడుకున్నట్లు తెలిపారు.