కళాకారులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుందన్న గురురాజు దేశాయ్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నిర్వహించిన నమో సేవా గాథ కార్యక్రమంలో స్థానిక కళాకారులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గురురాజు దేశాయ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం సంప్రదాయ కళారూపాలను పరిరక్షిస్తూ, కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ బేడ బుడగ జంగాల భజన మండలి సభ్యులు, డప్పు మరియు బుర్రకథ కళాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.