వర్షాలు వస్తే నిలిచిపోతున్న కంబిరిగాం బ్రాహ్మణతర్ల రాకపోకలు
రిపోర్టర్: Dinesh Panda
స్థలం: పలాస
శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలోని కంబిరిగాం, బ్రాహ్మణతర్ల వంతెనల వద్ద ప్రతి వర్షాకాలంలోనూ రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి. వంతెనలపై నుంచి వరద నీరు ప్రవహించడంతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయంలో ప్రాణాలకే ముప్పు వాటిల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.