నాగచైతన్య వృషకర్మ విడుదల తేదీ ఖరారు: డిసెంబర్ నాలుగున ప్రేక్షకుల ముందుకు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ వృషకర్మ చిత్రాన్ని డిసెంబర్ నాల్గో తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. నిధి అన్వేషణ, ఆధ్యాత్మిక అంశాలతో సాగే ఈ చిత్రంలో ట్రెజర్ హంటర్‌గా చైతన్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.