నాకు అత్యంత ఇష్టమైన హోదా భర్త స్థానమే: చంద్రబాబు భావోద్వేగం

రిపోర్టర్: శివ స్థలం: ఆంధ్రప్రదేశ్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి దంపతుల వివాహ బంధానికి నేటితో 45 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా భువనేశ్వరి శుభాకాంక్షలు తెలపగా, సీఎం చంద్రబాబు భావోద్వేగంగా స్పందించారు. అందరూ తనను ముఖ్యమంత్రిగా పిలిచినా, తనకు అత్యంత ఇష్టమైన హోదా మాత్రం భర్త స్థానమేనంటూ ఆయన చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.