ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్ర భూకంపం ఉలిక్కిపడిన హిందూ కుష్ ప్రాంతం
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆఫ్ఘనిస్తాన్
నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరాల ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో గురువారం తెల్లవారుజామున 5.3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. హిందూ కుష్ ప్రాంతంలో భూమికి 126 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం కేంద్రీకృతమైనట్లు స్పష్టం చేశారు. రాజధాని కాబూల్‌కు ఉత్తర-వాయువ్య దిశలో 165 కిలోమీటర్ల దూరంలో ప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదని అధికారులు పేర్కొన్నారు. భారత, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల కదలికల వల్లే ఈ ప్రాంతంలో తరచూ ప్రకంపనలు వస్తున్నట్లు శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు.