పాత లయను అందుకున్న భారత పేసర్ మహమ్మద్ సిరాజ్.

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

శ్రీలంక టూర్ సందర్భంగా బౌలింగ్ వేగం కోల్పోవడంపై భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ స్పందించాడు. రెండు నెలల పాటు ఆటకు దూరంగా ఉండటం వల్లే రిథమ్ దెబ్బతిన్నానని తెలిపాడు. అయితే దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ స్పెల్స్ వేయడం ద్వారా తిరిగి పాత లయను అందుకున్నానని, తన సహజమైన బలాలపైనే దృష్టి పెట్టానని మహమ్మద్ షమీ సూచనలతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చానని సిరాజ్ వెల్లడించాడు.